New Zealand: డబ్ల్యూటీసీ పాయింట్లలో కివీస్‌కు కోత.. 18 d ago
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు షాక్ ఎదురైంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో క్రిస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో, స్లో ఓవర్ రేట్ కారణంగా, మూడు పాయింట్ల కోత విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తెలిపింది. పాయింట్ల కోతనే గాక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ 15 శాతం జరిమానా పడింది. దీంతో న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 47.92 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఆ జట్టు ఫైనల్ రేసులో నిలవాలంటే తదుపరి ఆడబోయే రెండు టెస్టులలోనూ గెలిచి, ఇతర జట్ల ఫలితాలు కివీస్‌కు అనుకూలంగా వస్తేనే అవకాశముంటుంది.